: క్రికెట్ ఆడుతూ మృతి చెందిన ముంబై యువ ఆటగాడు


ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యుస్ మరణం నుంచి పూర్తిగా తేరుకోకముందే, వర్ధమాన ఆటగాడు రత్నాకర్ మోరే ముంబై ఓవల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ మృతి చెందాడు. టాటా పవర్ సంస్థ నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా ఆడుతున్న 29 ఏళ్ల రత్నాకర్ మైదానంలో గుండెపోటుతో కుప్పకూలాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయన భార్య ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఆమె ఆజాద్ మైదాన్ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ పరిధిలోనే క్రీడా మైదానం ఉండటం, అక్కడే కేసు నమోదు కావడంతో స్టేషన్ లో సైతం విషాదఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News