: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ టచ్ లోనే వున్నాడంటున్న కొడాలి నాని


రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత మిత్రత్వం కానీ ఉండవంటారు! కొందరిని చూస్తే అది నిజమే అనిపించకమానదు. ఒకప్పుడు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు అన్నంతగా స్నేహించిన జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కారణం రాజకీయాలే. బాబును వ్యతిరేకించిన నాని, వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన చేరడంతో వీరిమధ్య అంతరం అంతకంతకు పెరిగిపోయింది. అయితే ఈమధ్య కాలంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై జూనియర్ బొమ్మ దర్శనమివ్వడం పెను దుమారం రేపింది.

ఈ విషయమై నాని వివరణ ఇస్తూ.. తనతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారని వెల్లడించారు. టీడీపీని వీడినవారు నందమూరి కుటుంబంతో మాట్లాడవద్దని పార్టీ నేతలు ఆదేశించడం సరికాదని నాని చెప్పారు. ఇక నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టొద్దని నాని వైఎస్సార్సీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. కాగా, జూ. ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల సందర్భంగా తనకోసం ప్రచారం చేసేందుకు రాకపోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News