: హుక్కాపై నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీంకోర్టు
ధూమపాన ప్రియులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. హుక్కాపై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. హుక్కాను నిషేధిస్తూ బాంబే, మద్రాస్, గుజరాత్ హైకోర్టులు వెలువరించిన తీర్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కింది కోర్టుల తీర్పులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక పొగరాయుళ్ల కోసం బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లోనే పొగ తాగడంపై నిషేధం ఉందని, ప్రత్యేక ఏర్పాట్లున్న ప్రదేశాల్లో కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.