: మోదీ మరో రికార్డు... దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలున్న పార్టీగా బీజేపీ


దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ, తన పార్టీ బీజేపీకి మరో రికార్డును అందించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు (శాసన సభ్యులు) ఉన్న పార్టీగా బీజేపీ అవతరించింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా 1,025 మంది ఎమ్మెల్యేలున్నట్లు లెక్క తేలింది. ఇక లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదానూ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి 924 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 23న వెలువడనున్న జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సంఖ్యలో కొద్దిమేర మార్పులుండే అవకాశాలున్నాయి. పశ్చిమ భారతంలో మంచి పట్టున్న బీజేపీ, భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లోనూ పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. పార్టీ పాచికలు పారితే సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి అందిన తాజా రికార్డు ఇక ఏ పార్టీ బద్దలుకొట్టే అవకాశాలే ఉండవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News