: శంషాబాద్ సమీపంలో ‘వండర్‌ లా’ అమ్యూజ్‌ మెంట్ పార్క్


ఇప్పటికే కొచ్చి, బెంగళూరులో ‘వండర్‌ లా’ పేరిట అమ్యూజ్‌ మెంట్ పార్క్ లను ప్రారంభించిన వండర్‌ లా హాలిడేస్ హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అమ్యూజ్‌ మెంట్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాదులో మూడో పార్కును త్వరలో ప్రారంభించనున్నట్టు వండర్‌ లా హాలిడేస్ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 49.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో అమ్యూజ్‌ మెంట్ పార్కును నిర్మిస్తున్నామని, 2016 ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News