: పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ అక్కినేని
ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సీకో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ను ప్రచారకర్తగా నియమించుకుంది. దక్షిణ భారతంలో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి అఖిల్ తో పాటు తమిళ నటుడు ఆర్యను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు పెప్సీకో ఇండియా సీనియర్ డైరెక్టర్ రుచిరా జైట్లీ తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ 'మౌంటైన్ డ్యూ' ప్రచార చిత్రాల్లో కనిపిస్తారని తెలిపారు. యువత ఎక్కువగా ఇష్టపడే వారిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంలో భాగంగా వీరితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు.