: హైదరాబాదీ బిర్యానీకి ఆమిర్ ఖాన్ ఫిదా!


భోజన ప్రియుడిగా పేరొందిన బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హైదరాబాదీ బిర్యానీని సుష్టుగా లాగించేశాడు. తన తాజా చిత్రం 'పీకే' ప్రమోషన్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన అతడు చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో కలసి నగరంలోని ప్యారడైజ్ ను సందర్శించాడు. ప్యారడైజ్ బిర్యానీని ఇష్టంగా ఆరగించిన ఆమిర్, హైదరాబాదీ బిర్యానీ అద్భుతమని పేర్కొన్నాడు. గతంలోనూ ఓసారి హైదరాబాదీ బిర్యానీని ఆరగించానని, ఇక్కడి బిర్యానీ అంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ బిర్యానీలాగనే హైదరాబాద్ ప్రజలు చాలా మంచివారని ఆమిర్ చమత్కరించాడు.

  • Loading...

More Telugu News