: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరు ఇలా ఉంది: ప్రొ. హరగోపాల్
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టగానే కార్పొరేట్ విద్యను నిషేధిస్తుందని ఊహించానని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దశలవారీగా విక్రయించాలని పథకాలు రచించిందని అన్నారు. అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీని మించిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ దేశాన్ని ఏకంగా ఒకేసారి అమ్మకానికి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో వైద్య, విద్య రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చి విభజన చేసి ఉంటే ఖ్యాతి దక్కేదని ఆయన అభిప్రాయపడ్డారు.