: టీవీని స్మార్ట్ టీవీగా మార్చే గూగుల్ క్రోమ్‌ కాస్ట్


హెచ్ డీఎంఐ సౌకర్యం ఉన్న టీవీని స్మార్ట్ టీవీగా మార్చే మీడియా స్ట్రీమింగ్ అడాప్టర్ 'క్రోమ్‌ కాస్ట్'ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు గూగుల్ వెల్లడించింది. ఒక యాప్ ను ఫోన్లో లోడ్ చేసుకుని క్రోమ్‌ కాస్ట్ ను అటాచ్ చేసిన టీవీతో జత చేయడం ద్వారా టీవీని 'స్మార్ట్' గా మార్చుకోవచ్చని గూగుల్ తెలిపింది. యూఎస్‌బీ ఫ్లాష్‌డ్రైవ్‌ను పోలి ఉండే ఈ పరికరాన్ని ఇండియాలో భారతీ ఎయిర్‌టెల్ తో కలిసి అందించనున్నట్టు వివరించింది. కాగా, గూగుల్ క్రోమ్‌ కాస్ట్ ధర ఆస్ట్రేలియాలో 49 డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3 వేలన్నమాట.

  • Loading...

More Telugu News