: సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. హైదరాబాదుకు సంబంధించిన పలు అంశాలపై దాదాపు గంట నుంచి చర్చిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సురేశ్ రెడ్డి, భట్టి విక్రమార్క, నిరంజన్, ఎంఎన్ ప్రభాకర్, రాంమోహన్ రెడ్డి, టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, రమణ, నర్సారెడ్డి, బీజేపీ తరపున కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఎం తరపున సున్నం రాజయ్య, వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి పద్మారావు తదితర మంత్రులు కూడా పాల్గొన్నారు.