: మరోసారి హద్దులు చెరిగిపోయాయి... ఒక్కటైన ఏపీ అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి


ప్రేమకు కులం, మతం, దేశం తేడాలుండవని మరోసారి నిరూపితమైంది! కర్నూలు జిల్లా డోన్ కు చెందిన సురేంద్రనాథ్, ఫిలిప్పీన్స్ కు చెందిన శ్రేమెక్డో ఒక్కటయ్యారు. చదువుకునేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లిన సురేంద్రనాథ్ మనీలాలో వైద్య వృత్తి ప్రారంభించాడు. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న శ్రేమెక్డోతో ప్రేమలో పడ్డాడు. వీరి లవ్ కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా పెళ్లి చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వీరి వివాహం సోమవారం నాడు వేడుకగా జరిగింది. వధువు తల్లిదండ్రులు డాక్టర్ ఎమడోమెక్డో, ఎలీషా, వారి బంధువులు ఈ వివాహానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News