: విమర్శించేందుకు ఏమీ లేకనే...: విపక్షాలపై మోదీ విసుర్లు


సంతృప్తికరంగా సాగుతున్న తమ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం లభించకనే విపక్షాలు అతి చిన్న సమస్యలను భూతద్దంలో చూపి పార్లమెంటును అడ్డుకోవాలని చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నేటి ఉదయం ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఝార్ఖండ్ ప్రజల మద్దతు ఎంతగానో ఉపయోగపడిందన్న మోదీ, అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో 30 ఏళ్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందని, అలాగే రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి ప్రజలు పూర్తి ఆధిక్యం ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు.

  • Loading...

More Telugu News