: ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా వెబ్ సైట్ లో పెట్టాలని కోరారు. ఏప్రిల్-నవంబరు వరకు ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, పన్నులు, లోటు, ఇతర విషయాలు వెబ్ సైట్ లో ఉంచాలని లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అనుసరిస్తోందని, తమ విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం పరిశీలించాలని తెలిపారు.