: తెలంగాణలో సోనియా జీవిత చరిత్ర పాఠ్యాంశంగా పెట్టాలి: పొంగులేటి


ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంగా పెట్టాలని సీఎం కేసీఆర్ ను కోరామని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ ప్రతిపాదనకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు. సోనియా గాంధీ 68వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News