: జనావాసాల్లో కూలిన విమానం... ఆరుగురు దుర్మరణం
అమెరికాలో ఓ చిన్న జెట్ విమానం కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వాషింగ్టన్ నగర శివార్లలోని జనావాసాల్లో ఈ విమానం (ఎంబ్రేయర్ ఈఎంబీ-500) కూలిపోయింది. మాంట్ గోమెరీ కౌంటీ ఎయిర్ పోర్టుకు మైలు దూరంలోనే ఘటన చోటు చేసుకుంది. నార్త్ కరోలినా నుంచి వస్తున్న ఈ రెండు ఇంజన్ల విమానం ల్యాండింగ్ కు సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగిందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు, ఓ ఇంట్లోని తల్లి, ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాత పడ్డారు. విమాన శకలాలు పలు నివాసాలను తాకాయి. ఫెడరల్ ఏవియేషన్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.