: కోమాలోనే కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్
కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. నాలుగు నెలలుగా ఆయన కోమాలోనే ఉన్నారు. గత ఆగస్టు 8న ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. జస్వంత్ సింగ్ ఆస్పత్రిలో చేరి నిన్నటికి సరిగ్గా నాలుగు నెలలు దాటింది. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు. న్యూరో సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు జస్వంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నాలుగు నెలల పాటు చికిత్స అందించినా జస్వంత్ సింగ్ ఆరోగ్యం మెరుగు కాలేదని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.