: జార్ఖండ్ పోలింగ్ లో ఘర్షణ... ఎమ్మెల్యే అరెస్ట్


జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇఛాగఢ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఘర్షణల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, జార్ఖండ్ ముక్తి మోర్చా (ప్రజాతంత్రిక్) పార్టీ నేత అరవింద్ కుమార్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ, అరవింద్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ అభ్యర్థి సాదు చరణ్ మెహతోతో పాటు మరో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ సింగ్ పై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. అరవింద్ కుమార్ సింగ్ తో పాటు ఆయన అనుచరవర్గంలోని 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ నీహాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News