: పాక్ క్రికెటర్లను నీడలా వెంటాడే ఏజెంట్లు!


ప్రపంచ క్రికెట్లో ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ పాక్ క్రికెటర్లు ఉంటారన్నది ఓ నానుడి! ముఖ్యంగా క్రికెట్ ను పట్టిపీడిస్తోన్న ఫిక్సింగ్ జాఢ్యంలోనైతే దాయాదుల టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకటిన్నర దశాబ్దం నుంచి పాక్ జాతీయ ఆటగాళ్ళలో అత్యధికులు ఏదో ఒక సందర్భంలో ఫిక్సింగ్ మకిలి అంటించుకున్న వారే. మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్, సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, ఆసిఫ్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఫిక్సింగ్ కారణంగా తమ కెరీర్ ను మసకబార్చుకున్నారు. ఐసీసీ వెల్లడించిన వాస్తవాలివి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తమ క్రికెటర్ల నడవడికపై నిఘా వేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం కొందరు ఏజెంట్లను కూడా నియమించింది. వీరి పనేంటంటే, పాక్ జట్టు ఏదేని సిరీస్ లో ఆడుతున్నప్పుడు మైదానం లోపల, వెలుపల.. హోటళ్ళ వద్ద ఆటగాళ్ళ తీరు తెన్నులు ఎలా ఉన్నాయన్నది నిశితంగా గమనించడమే. అంతేగాకుండా, పాక్ క్రికెటర్లు ఏవైనా అవాంఛనీయ వివాదాల్లో చిక్కుకోకుండా కాపాడడమూ వీరి విధే. వచ్చే జూన్ లో పాక్ జట్టు ఇంగ్లండ్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడనుంది. గత ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన ఫిక్సింగ్ అనుభవాలతో తలబొప్పి కట్టిన పాక్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News