: సొంత జిల్లా నుంచి రుణమాఫీని ప్రారంభించనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీ ప్రక్రియ చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరే. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల రుణమాఫీని కూడా తన సొంత జిల్లా నుంచే ప్రారంభించేందుకు చంద్రబాబు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జిల్లా రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయడం ద్వారా చంద్రబాబు రుణమాఫీని లాంఛనంగా మొదలుపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News