: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖులకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంలో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాక, రాజకీయాల్లో తన ప్రత్యర్థులకు సైతం గ్రీటింగ్స్ పంపడంలో మోదీనే అందరికంటే ముందుంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం మోదీ ఆమెకు బర్త్ డే విషెస్ ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్ లో సోనియాకు జన్మదిన శుభాకాంక్షలను పోస్ట్ చేశారు. "భగవంతుడు సోనియాగాంధీకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని సదరు పోస్ట్ లో ఆయన సోనియాకు శుభాకాంక్షలు చెప్పారు.