: జిల్లా అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ వెంటనే పలువురు అధికారులతో కలసి జిల్లా స్థాయి అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాల తీరు, ఇటీవల తొలిసారి రుణమాఫీ ప్రకటించిన అంశంపై వారితో చర్చిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రుణమాఫీ అమలును లాంఛనంగా ఈనెల 11న సీఎం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో జిల్లా రైతులకు బాబు బాండ్లను అందజేయనున్నారు.