: టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 238/2
అడిలైడ్ లో జరుగుతుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టీ విరామ సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ 131 పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుండి నడిపిస్తున్నాడు. స్మిత్ 17 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రోగర్స్, వాట్సన్ ఔట్ కాగా, క్లార్క్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్ చెరొక వికెట్ తీసుకున్నారు.