: చౌక ధరల పేరిట యోగం ట్రేడర్స్ భారీ మోసం... కృష్ణా జిల్లాలో మహిళల ఆందోళన
చౌక ధరలకే గృహోపకరణాలను అందజేస్తామని మాయ మాటలు చెప్పి రంగంలోకి దిగిన యోగం ట్రేడర్స్ కృష్ణా జిల్లా ప్రజలను నిండా ముంచేసింది. అతి తక్కువ ధరలకే గృహోపకరణాలను అందజేస్తామని భారీగా ప్రకటనలు గుప్పించిన యోగం ట్రేడర్స్ జిల్లాలోని ఉయ్యూరులో కార్యకలాపాలు ప్రారంభించింది. యోగం ట్రేడర్స్ ప్రకటనలకు విశేషంగా ఆకర్షితులై జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున డబ్బులు కట్టారు. అయితే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసుకున్న యోగం ట్రేడర్స్ యాజమాని అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న మహిళలు సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.