: చెన్నై ఎయిర్ పోర్టులో 6.5 కిలోల బంగారం పట్టివేత
చెన్నై ఎయిర్ పోర్టుకు అక్రమ మార్గాల్లో తరలివచ్చిన 6.5 కిలోల బంగారాన్ని నేటి ఉదయం అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన రియాజ్ అనే వ్యక్తిని సోదా చేసిన కస్టమ్స్ అధికారులు అతడి వద్ద నుంచి 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి భారీ స్థాయిలో బంగారం దేశానికి తరలివస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా నిఘా పెంచడంతో అక్రమంగా తరలివస్తున్న బంగారం పట్టుబడుతున్న ఘటనలు నిత్యం నమోదవుతున్నాయి.