: హ్యూస్ కు టీమిండియా, ఆసీస్ జట్ల నివాళి


బౌన్సర్ కు బలైన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ కు టీమిండియా, ఆసీస్ క్రికెట్ జట్లు నేటి ఉదయం ఘనంగా నివాళి అర్పించాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఇరు జట్ల మధ్య అడిలైడ్ లో తొలి టెస్ట్ నేటి ఉదయం ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు 63 సెకన్ల పాటు హ్యూస్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఇరు జట్ల సభ్యులు నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించారు. ఇదిలా ఉంటే, టాస్ సందర్భంగానూ ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, హ్యూస్ ను తలచుకున్నాడు. హ్యూస్ లేకపోవడం తమకు పెద్ద లోటేనన్న క్లార్క్, అతడెప్పడూ తన మదిలో ఉంటాడని ప్రకటించాడు.

  • Loading...

More Telugu News