: నేటి నుంచి నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభం


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణం కోసం భూములివ్వనున్న రైతులకు అందజేసే ప్యాకేజీని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైతులు భూములను ప్రభుత్వానికి అప్పగించిన మరుక్షణమే వారికి రసీదులు అందనున్నాయి. అంతేకాక రసీదులు పొందిన మూడేళ్లలో అభివృద్ధి చేసిన నివాస, వ్యాపార సముదాయాలను వారికి ప్రభుత్వం కేటాయించనుంది. ఓ వైపు భూ సమీకరణ జరుగుతుండగానే, రాజధాని ప్రధాన నిర్మాణాలు ఏర్పాటు కానున్న ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో పనులు ప్రారంభం కానున్నాయి. పనులను పక్కా వాస్తు ప్రకారం చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News