: నేడు కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం


తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో మార్పులు, నగరంలో వినాయక నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చెరువుల గుర్తింపు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించనుంది. శాసనసభ, శాసనమండలిలోని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులందరినీ ప్రభుత్వం ఈ సమావేశానికి ఆహ్వానించింది. మెట్రో మార్గం మార్పుపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ లేవనెత్తిన పలు అభ్యంతరాలపై అఖిలపక్ష భేటీని నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వినాయక నిమజ్జనం విషయంలో హుస్సేన్ సాగర్ కు ప్రత్యామ్నాయం చూసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా నేటి అఖిలపక్ష భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. సర్కారీ భూముల దురాక్రమణపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసిన కేసీఆర్, అందులో ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా, ఆ పార్టీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఈ భేటీని వినియోగించుకోనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News