: నేడు సోనియాగాంధీ జన్మదినం... వేడుకలకు దూరం
నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ 67వ జన్మదినం. డిసెంబర్ 9, 1946 లో ఆమె ఇటలీలోని లూసియానాలో జన్మించారు. ఆమె అసలు పేరు ఎడ్విగే ఆంటోనియా ఆల్బినా మైనో. ఆమె తండ్రి 1983లో చనిపోగా... తల్లి, ఇద్దరు సోదరిలు ఇటలీలోని ఆర్బస్సానోలో నివసిస్తున్నారు. సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా జరుపుకోవడం ఆనవాయతీ. కానీ, ఈసారి మాత్రం వేడుకలకు దూరంగా ఉండాలని సోనియా నిర్ణయించారు. ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్ లలో జవాన్లపై మావోయిస్టులు, ఉగ్రవాదులు దాడులు జరపడంతో... పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు సోనియా విముఖత చూపుతున్నారు.