: 80 మంది డీఎస్పీలకు పదోన్నతులు, బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీలకు స్ధాన చలనం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80 మంది డీఎస్పీలకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఎస్పీల పదోన్నతులు, బదిలీలపై డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో గత కొంత కాలంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్పీల బదిలీలు, పదోన్నతులు చేపట్టినట్టు సమాచారం.