: మంచి సినిమా తీశారు: అనుష్క
లింగా సినిమాలో యూనిట్ అంతా కుటుంబంలా కష్టపడి మంచి సినిమా తీశారని హీరోయిన్ అనుష్క తెలిపారు. హైదరాబాదులోని లింగా సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో సినిమా షూటింగ్ జరిగిపోయిందని తెలిపింది. విశ్వనాథ్ గారు లాంటి వారితో నటించడం తనకు గౌరవమని ఆమె చెప్పారు. రజనీకాంత్ గారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు. అలాగే ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చని ఆమె తెలిపారు. సోనాక్షి గురించి తెలియకపోయినా, ఆమె తండ్రి గురించి తెలుసు కనుక ఆమెతో ఎవరైనా ఇట్టే కలిసిపోవచ్చని తెలిపారు. ఆమె అద్భుతంగా ఉన్నారని అనుష్క కితాబిచ్చారు. జగపతి బాబుగారు, దర్శకులు కేఎస్ రవికుమార్... ఇలా అంతా తనకు ఎంతో సహకరించారని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.