: నేను అక్షింతల్లాంటి వాడ్ని...సినిమా కోసం ఎదురు చూస్తున్నా: త్రివిక్రమ్ శ్రీనివాస్
పెళ్లికి జీలకర్ర, బెల్లం ఎంతో ముఖ్యం, అక్షింతలు పక్కనే ఉంటాయి. వాటిని అందరూ వేసుకుని వెళ్లిపోతుంటారు. తాను కూడా అక్షింతలు వేయడానికే వచ్చానని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులోని నోవాటెల్ లో లింగా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, రజనీకాంత్ సినిమా అనగానే అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారని, తాను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఏవైనా ఆవార్డులు, సినిమా ఫంక్షన్ల కోసం తనను పిలుస్తూ ఉంటారని, తాను కూడా అలాంటప్పుడే వస్తానని ఆయన చెప్పారు.