: రజనీకాంత్ ఎందుకు అంత గొప్ప మనిషి అయ్యారో తెలుసా?: జగపతి బాబు
రజనీకాంత్ ఎందుకు అంత గొప్ప మనిషి? అని తాను చాలాసార్లు ఆలోచించానని హీరో జగపతిబాబు తెలిపారు. హైదరాబాదులో 'లింగా' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను చాలా కాలం చెన్నైలో ఉన్నానని, అప్పట్నుంచే తాను ఆయనను అభిమానించేవాడినని అన్నారు. ఓ సందర్భంలో ఆయనతో మాట్లాడుతూ, 'సార్, మీరెలా అంత సాధారణంగా ఉండగలుగుతున్నార'ని అడిగానని, అప్పుడాయన 'బాబు, నేను కండక్టర్ ని అనే విషయాన్ని ఇప్పటికీ మరువలేనని, తనకు లభించినదంతా బోనస్ అని' ఆయన పేర్కొన్నారు. అందుకే తాను సాధారణమైన కండక్టర్ లా ఉంటానని ఆయన చెప్పారని, అంత గొప్ప వ్యక్తి అలా అనడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన చెప్పారు. ఆయనను చూసి ఎంతో నేర్చుకోవచ్చని జగపతి బాబు తెలిపారు.