: శ్రీనీకి ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే ఎలా నమ్మాలి?: సుప్రీం


ఐపీఎల్ ఫిక్సింగ్ పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పై సందేహం వ్యక్తం చేసింది. ఫిక్సింగ్ చోటు చేసుకున్న సమయంలో శ్రీనీ బీసీీసీఐకి అధ్యక్షుడిగానూ, అటు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగానూ వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అలాంటప్పుడు ఆయనకు ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే ఎలా నమ్మాలని వ్యాఖ్యానించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగే వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండాలని శ్రీనివాసన్ కు హితవు పలికింది. అటు, శ్రీనివాసన్ న్యాయవాది సిబాల్ కూడా వాదనలు వినిపించారు. ఇవన్నీ కూడా తన క్లయింటును బీసీసీఐకి దూరంగా ఉంచేందుకు అతని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలేనని అన్నారు. బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ బాంబే హైకోర్టులో శ్రీనివాసన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ ను సిబాల్ ఈ సందర్భంగా ఉదహరించారు.

  • Loading...

More Telugu News