: 40 ఏళ్ల నాటి 'మాజీ రైల్వే మంత్రి హత్య' కేసులో దోషులుగా నలుగురు


మాజీ రైల్వే మంత్రి ఎల్.ఎన్.మిశ్రా హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు నలుగురిని దోషులుగా గుర్తించింది. బీహార్ లో 40 ఏళ్ల నాడు జరిగిన ఘటనకు సంబంధించిన ఈ కేసులో విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరికి ఈరోజు నలుగురిని దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం వారికి శిక్ష మాత్రం విధించలేదు. డిసెంబర్ 15న శిక్షలను ఖరారు చేసే అవకాశం ఉంది. 1975 జనవరి 2న సమస్థిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి మిశ్రా హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో మంత్రి మరణించారు. అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సమయంలో 161 ప్రాసిక్యూషన్ సాక్షులు, మరో 40 మంది డిఫెన్స్ సాక్షులను విచారించారు.

  • Loading...

More Telugu News