: ఢిల్లీలో 'ఉబెర్ క్యాబ్' సర్వీసులు తిరగవు!


ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీసులు ఇకపై తిరగకూడదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉబెర్ క్యాబ్ సర్వీసుకు చెందిన ఓ డ్రైవర్, తన క్యాబ్ లో ప్రయాణించిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం, ఆ క్యాబ్ సర్వీసును నిషేధించింది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. కాగా, ఈ కీచక క్యాబ్ డ్రైవర్ 2011లో ఓ మహిళపై అత్యాచారం కేసులో అరెస్టయిన వ్యక్తి. అతని కాండక్ట్ పై ఎలాంటి విచారణ లేకుండానే అతనికి ఉబెర్ క్యాబ్ లో ఉద్యోగం ఇచ్చారు.

  • Loading...

More Telugu News