: పాకిస్థాన్ పై గెలిచి, అంధుల వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్
అంధుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్ విజయఢంకా మోగించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్ టైటిల్ చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరిగింది. కాగా, ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 389 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో మరో రెండు బంతులు మిగిల్చిన భారత కుర్రాళ్లు 392 పరుగులు చేశారు. ఈ టోర్నీలో భారత్, పాక్ తో పాటు ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి.