: మోదీ సభకు రైళ్లలో జనాన్ని తరలించారు: కాశ్మీర్ సీఎం ఒమర్


కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. శ్రీనగర్ లో మోదీ సభకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు. 'బనిహాల్ నుంచి రెండు రైళ్ల నిండా ప్రజలను తీసుకువచ్చారు. అసలు, బీజేపీ బనిహాల్ లోనే ఎందుకు సభ పెట్టకూడదు?' అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అలా తీసుకువచ్చిన ప్రజల వద్ద కనీసం ఓ బీజేపీ జెండా కూడా లేదని, వారిని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలపై బ్యానర్లు కూడా లేవని ఒమర్ తెలిపారు. వారు బీజేపీ మద్దతుదారులనడానికి అదే సంకేతం అని వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం ఒమర్ అధికారిక నివాసం సభా ప్రాంగణానికి దగ్గర్లోనే ఉంది. ప్రస్తుతం మోదీ శ్రీనగర్ సభలో ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News