: రాజధాని పేరుతో రూ. 5 లక్షల కోట్ల స్కాం: వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 5 లక్షల కోట్ల స్కాంకు తెర లేపారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆరు నెలల చంద్రబాబు పాలనలో అన్నీ వైఫల్యాలే అని ఎద్దేవా చేశారు. ఇంత వరకు ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో విదేశీ టూర్లు చేస్తున్నారని... ఇంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి కూడా రాలేదని అన్నారు.