: 2.15 లక్షల పేజీల పత్రాలతో జయలలిత అప్పీలు


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడగా, ప్రస్తుతం బెయిలుపై ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో అప్పీలు పిటీషన్ దాఖలు చేశారు. మొత్తం 667 పుస్తకాల్లో 2.15 లక్షల పేజీల పత్రాలను ఆమె కోర్టుకు సమర్పించారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని బెంచ్ స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే, రెండు నెలల్లోగా అప్పీలుకు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జయలలిత నేటి ఉదయం కోర్టుకు అప్పీలు పత్రాలు అందించారు.

  • Loading...

More Telugu News