: ఒకే వేదికపై తండ్రీకొడుకుల సంగీత విభావరి


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజాలు ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. తొలిసారి వారిద్దరు కలసి చేస్తున్న ఈ కార్యక్రమానికి తిరునల్వేలి వేదిక కానుంది. 'యువన్ మ్యూజికల్ ఎక్స్ ప్రెస్' పేరుతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 17, 2015న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు, ఇందులో తండ్రితో కలసి ప్రదర్శన ఇవ్వనున్నట్టు యువన్ తెలిపాడు. "దక్షిణ తమిళనాడు కోసం ప్రదర్శన ఇవ్వాలని నా కోరిక. నా తొలి చిత్రం 'అరవిందన్'ను నెల్లైలో చిత్రీకరించిన నేపథ్యంలో తిరునల్వేలిని ఎంచుకున్నాం" అని యువన్ ఓ ప్రకటనలో వివరించాడు. తమతో పాటు పలువురు గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పాడు.

  • Loading...

More Telugu News