: కీలక భేటీలో క్యాండీ క్రష్ ఆడుతూ మీడియాకు దొరికిన బ్రిటన్ ఎంపీ


బ్రిటన్ లో ఓ ఎంపీ కీలక సమావేశంలో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ మీడియా కంటబడ్డాడు. నిగెల్ మిల్స్ అనే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఐపాడ్ లో క్యాండీ క్రష్ ఆడుతుండగా తీసిన ఫొటోలను 'ద సన్ ' టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. అనంతరం, తాను క్యాండీ క్రష్ ఆడినట్టు ఈ ప్రజాప్రతినిధి అంగీకరించారు. 'ద సన్' తో మాట్లాడుతూ, అది పింఛన్ సంస్కరణలపై ఓ సుదీర్ఘ సమావేశమని, మధ్యలో తాను సమావేశంపై దృష్టిపెట్టలేకపోయానని, అందుకే క్యాండీ క్రష్ గేమ్ ఆడానని వివరణ ఇచ్చారు. తాను అలా చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆంబర్ వ్యాలీ నియోజకవర్గం నుంచి మిల్స్ 2010లో ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News