: లోక్ సభలో విపక్షాలపై మండిపడ్డ వెంకయ్యనాయుడు


కాసేపటి క్రితం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. యథావిథిగా ఈ రోజు కూడా విపక్ష సభ్యులు సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల అంశాన్ని సభలో లేవనెత్తారు. దీంతో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారని... ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా వివరణ ఇచ్చారని... దీంతో, ఈ అంశం ముగిసిందని చెప్పారు. అనవసరంగా ఇదే అంశాన్ని పదేపదే లేవనెత్తుతూ, సభను అడ్డుకోవడం మంచిది కాదని మండిపడ్డారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News