: ఎమ్మెల్యే శోభ కారును ఢీకొట్టిన మందుబాబులు
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రయాణిస్తున్న కారును మందు తాగి బైక్ నడుపుతున్న యువకులు కొద్దిగా తాక్కుంటూ వెళ్లారు. హసన్ పర్తి బస్టాండ్ సమీపంలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. వెంటనే ఆమె తన కారును రోడ్డు పక్కన ఆపి, పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలో కూర్చొని పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా పోలీసులను పిలిపించి, మందు తాగి బైక్ నడిపిన యువకులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో, వాహనదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం ఎమ్మెల్యే శోభ చొప్పదండికి బయలుదేరి వెళ్లారు.