: షర్మిల పరామర్శ యాత్రను ప్రజలు స్వాగతిస్తారు: తెలంగాణ వైసీపీ
నేటి నుంచి తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు షర్మిల చేపడుతున్న పరామర్శ యాత్రకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలో కోట్లమంది అభిమానులున్నారన్నారు. కాబట్టి తప్పకుండా షర్మిల యాత్ర విజయవంతమవుతుందని చెప్పారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. యాత్రలో షర్మిల వెంట పొంగులేటి కూడా ఉంటారు.