: మహానందిలో దర్శనం, సేవల టికెట్ ధరల పెంపు... మండిపడుతున్న భక్తులు
కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని మహానందిలో స్వయంభువుగా కొలువై పూజలందుకుంటున్న మహానందీశ్వరుడు భక్తులకు భారం కానున్నాడు. నల్లమల కొండల పాదాల వద్ద సహజసిద్ధ జలాశయాలపై ఉన్న దేవదేవుని దర్శనం టికెట్ ధరలను దేవాదాయ శాఖ విపరీతంగా పెంచడమే ఇందుకు కారణం. రూ.25గా ఉన్న సర్వ దర్శనం టికెట్ ధరను రూ.100కు, అభిషేకం టికెట్ ధరను రూ.1000కి పెంచుతూ దేవాలయ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర నామార్చన, స్వామివారి కల్యాణం, గోపూజ, నవగ్రహముల పూజ, రుద్ర హోమం తదితర సేవల టికెట్ ధరలనూ గణనీయంగా పెంచింది. ఈ పెంపు నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.