: రాత్రంతా శ్మశానంలో గడిపిన కర్నాటక మంత్రి
చేతబడులు, క్షుద్ర పూజలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నాటక రాష్ట్ర మంత్రి సతీష్ జర్కిహోలి రాత్రంతా బెలగావి శ్మశానంలో గడిపారు. ఆయన, ఆయన అనుచరులు అక్కడే భోజనాలు ముగించి పడకేశారు. దహన సంస్కారాలు జరిగే చోట రాత్రిపూట దయ్యాలు ఉంటాయన్న నమ్మకాన్ని పోగొట్టడం తన తొలి ఉద్దేశమని ఆయన అన్నారు. శ్మశానాలు పుణ్య క్షేత్రాల వంటివని ఆయన అన్నారు.