: రక్షణ చట్రంలో శ్రీనగర్... నేడు మోదీ పర్యటన
దేశంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, విభజనవాదులకు అడ్డా అయిన శ్రీనగర్ లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల సభలో పాల్గొనేందుకు మోదీ శ్రీనగర్ వెళుతున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో, శ్రీనగర్ నగరం పూర్తి స్థాయిలో రక్షణ చట్రంలోకి వెళ్లిపోయింది. అడుగడుగునా సైన్యం మోహరించి ఉంది. సభ జరిగే షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం, చుట్టుపక్కల ప్రాంతాలు నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. ఏరియల్ నిఘా కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. యూరి సెక్టార్లో లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్లు సైనిక శిబిరంపై దాడి చేసిన నేపథ్యంలో, శ్రీనగర్ ను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు.