: పురాతన దేవాలయంలో భాగమే తాజ్ మహల్: యూపీ బీజేపీ నేత
మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పురాతన దేవాలయంలో భాగంగా తాజ్ మహల్ ను నిర్మించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ వ్యాఖ్యానించారు. రాజా జై సింగ్ నుంచి తేజో మహాలయ టెంపుల్ లోని కొంత భాగాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశాడని, అందుకు సాక్ష్యాధారాలున్నాయని అన్నారు. ఇటీవల సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ మాట్లాడుతూ, తాజ్ మహల్ ను వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలని, వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ వ్యాఖ్యలకు ప్రతిగానే లక్ష్మికాంత్ బాజ్ పాయ్ మాట్లాడారని తెలుస్తోంది.