: రాజధాని ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు


జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. రైల్లో బాంబు పెట్టామని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ తో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. దీంతో, నిన్న రాత్రి పంజాబ్ లోని పఠాన్ కోట్ వద్ద రైలు ఆపివేశారు. భారత సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి నాలుగు గంటలకు పైగా రైలును తనఖీ చేశారు. రైల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పఠాన్ కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, జమ్మూలో ఈ మధ్య కాలంలో ఉగ్ర దాడులు పెరగడంతో, భద్రతా సిబ్బంది నిఘా పెంచారు.

  • Loading...

More Telugu News