: సర్కారు బడిలో సందడి చేసిన రెజీనా
విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని సినీ నటి రెజీనా కసాండ్రా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆంగ్లంలో ప్రావీణ్యం పెంపొందించే ఉద్దేశంతో 'టీచ్ ఫర్ ఛేంజ్' అంటూ, ఓ స్వచ్ఛంద సంస్థ వంద పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించింది. అమీర్‌పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెజీనా, మాజీ మిస్సెస్ ఇండియా శిల్పారెడ్డి, స్వామి అగ్నివేశ్, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, తాను కూడా వారంలో రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆమెను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. రెజీనా సైతం పిల్లలతో కలసి సందడి చేశారు.